1 July, 2026 | 12:48 AM

అసలే ఆక్రమణ.. ఆపై వ్యర్థాలు

01-07-2026 12:01 AM

అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం 

సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని స్థానికుల డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని మేడికుంట చెరువు ఆక్రమాలకు గురైందని ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాం సమయంలో వ్యర్ధాలతో నిండిపోయిందని మరో విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారులను నిర్లక్ష్యానికి మేడికుంట చెరువు నిలువెత్తు నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వర్షపు నీటితో కలకలలాడే మేడికుంట చెరువు నేడు వ్యర్థాలతో నిండి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. స్థానికుల కథనం ప్రకారం చెరువు పరిసర ప్రాంతంలో కొందరు ఆక్రమణదారులు ఒక వైపు నుంచి మట్టి పోసి స్థలాన్ని చదును చేస్తూ చెరువు విస్తీర్ణాన్ని క్రమంగా కబ్జా చేస్తూన్నారని ఆరోపిస్తున్నారు.

నీటి పారదర్శక అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భవిష్యత్తులో మేటికుంట చెరువు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఎలా ఉండగా మరోవైపు చెరువు చెత్త ప్లాస్టిక్ వ్యర్ధాలు పిచ్చి మొక్కలతో పేరుకుపోయి దుర్గందాన్ని వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దోమలు విశ్రమించి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజారోగ్యానికి హానికరంగా మారే ఈ పరిస్థితిపై మున్సిపల్ కార్పొరేషన్, నీటి పారదల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువులోనే చెత్త మరుగు కలుపు మొక్కలను వెంటనే తొలగించాలని, మురుగు నీరు చెరువులోకి చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, చెరువు అభివృద్ధి సుందరీ కర్ణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, పట్టణ ప్రజల ఆరోగ్యం , పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

కంచికి పోయిన పార్క్ హామీ? 

జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో మేడికుంట చెరువును పార్కుగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. ఆక్రమణలను తొలగించి చెరువు ను పరిరక్షించడంతోపాటు పట్టణ ప్రజల కు ఆహ్లాదకర వాతావరణ అందిస్తామన్న ఆనాటి ఎమ్మెల్యే హామీ అమలు కాలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే సాంబశివరావు ఆ దిశలో చర్యలు తీసుకోవాలని పాల్వంచ పట్టణ ప్రజలు కోరుతున్నారు.