1 July, 2026 | 12:57 AM

‘కళ్యాణలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి

01-07-2026 12:00 AM

ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సూర్యాపేట, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాలకు అందించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను పేదింటి మహిళలు సద్వినియోగపరుచుకోవాలని   సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్ పహాడ్,  సూర్యాపేట అర్బన్ రూరల్ మండలాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.1,50,17,400 విలువైన కల్యాణలక్ష్మీ,

షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని వీటిని ప్రతి ఒక్క పేదింటి మహిళ  సద్వినియోగపరుచుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.