ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
- శంకర్ మృతి బాధాకరం
- డిమాండ్లను నెరవేర్చకపోవడం వల్లే ఈ పరిస్థితి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- ముషీరాబాద్ డిపో వద్ద కార్మికులకు మద్దతు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం, అందులో ఒకరు ప్రాణం కోల్పోవడం తన ను ఎంతో కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్ మరణించడం అ త్యంత బాధాకరమన్నారు. శంకర్‌గౌడ్ మృ తి పట్ల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.
శుక్రవారం ము షీరా బాద్ బస్‌డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాంచందర్‌రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఈ దారుణ పరిస్థితి ఎదురైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూ ర్తిగా పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాల్సింది పోయి కమిటీల పేరుతో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయ త్నం చేసిందన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన పోరుబాట చివరకు సమ్మెకు దారితీసి, రాష్ట్రంలో పరిస్థితిని ఆందోళనకరంగా మార్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు ముందుగానే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.






