13 May, 2026 | 1:19 AM

‘పర్సెంటేజ్ షేరింగ్’ అమలు చేయాలి

13-05-2026 12:25 AM

థియేటర్ల బంద్ పాటించడం లేదు

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, కొనసాగింపునకు సంబంధించి ప్రతిపాదిత పర్సెం టేజ్ షేరింగ్ విధానం అమలుపై తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. నిర్మాతలు చదలవాడ శ్రీని వాస్, శిరీష్‌రెడ్డి, సునీల్ నారంగ్,తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ తోపాటు పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

మీడియాతో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎగ్జిబిటర్లను బతికించుకోవాల్సిన అవసరం నిర్మా తలపై ఉందన్నారు. నిర్మాత శిరీష్‌రెడ్డి మా ట్లాడుతూ.. ‘పర్సెంటేజ్ విధానం అమలు ఎగ్జిబిటర్ల బ్రతుకుపోరాటం. మిగిలిన రాష్ట్రాల్లో థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేసి తెలుగులో మాత్రం ఎందుకు రెంటల్ పద్ధతిలో సినిమా రిలీజ్ చేస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి. దయచేసి ఎగ్జిబిటర్లను కాపాడండి అని విజ్ఞప్తి చేశారు.