6 May, 2026 | 11:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఆడబిడ్డల అభ్యున్నతికి కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

26-02-2026 12:09 AM
  1. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందించిన 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి) : ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రజా ప్ర భుత్వం కట్టుబడి పనిచేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ సమయంలో భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల అభివృద్ధి, సాధికారత కోసం వారి పేరుతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దరాం సుధాకర్ రెడ్డి ,హన్వాడ మండల్ ప్రెసిడెంట్ మహేందర్ ,సర్పంచ్ బొట్టు శ్రీను ,సుధాకర్ ,సతీష్ ,సుదర్శన్ ,లింగం నాయక్ ,శంకర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు టంకర కృష్ణయ్య, కార్పొరేటర్ ప్రశాంత్ ,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.