26 February, 2026 | 1:59 AM

అలంపూర్ అభివృద్ధికి కృషి

26-02-2026 12:11 AM

ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్, ఫిబ్రవరి 25 : అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం అలంపూర్ చౌరస్తా తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అ లంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అలంపూర్ ,ఐజ, ఎర్రవల్లి, వడ్డేపల్లి, ఉండవల్లి ఇటిక్యాల మం డలాలకు చెందిన 515 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయుడు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు వారి వివాహనికి ఆర్థిక సాయాన్ని అందించడం సంతోషకరమని ... అర్హులైన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా అల్లంపూరు ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రెవిన్యూ అధికారులు, నాయకులు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.