పెట్రోలింగ్ సిబ్బంది సమయస్ఫూర్తి
సిద్దిపేట క్రైం, మే 23(విజయక్రాంతి) : హైవే పెట్రోలింగ్ పోలీసుల సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఒక ఎయిర్ కంప్రెషర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు పక్కనే ఉన్న పొలంలో ఓ రైతు వరి కోత అనంతరం శుక్రవారం సాయంత్రం మిగిలిన భాగాలను తగులబెట్టారు. ఆ మంటలు ఎయిర్ కంప్రెషర్ షాపు వరకు వ్యాపించాయి.
ఆ సమయంలో విధుల్లో ఉన్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబు ల్ విఠల్ స్పందించారు. సకాలంలో సంఘటనా చేరుకుని, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వారిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.






