27 April, 2026 | 2:14 AM

బడి బాట-హాస్టల్ బాట

27-04-2026 12:30 AM
  1. వంద శాతం ప్రవేశాలే లక్ష్యం
  2. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 7వ రోజు
  3. ప్రత్యేక నమోదు కార్యక్రమం

రంగారెడ్డి, ఏప్రిల్ 26(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ’ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ‘బడి బాట/హాస్టల్ బాట‘ ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

హాస్టళ్లు మరియు ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న ప్రతి ఖాళీ సీటును గుర్తించి, అర్హులైన విద్యార్థులతో భర్తీ చేయడం. అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం లభించక చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ డ్రైవ్ను చేపట్టారు. ఈ సందర్భంగా హాస్టల్ సంక్షేమ అధికారులు (ASWO/ASCDO/ATWO) మరియు సిబ్బంది ఆధ్వర్యంలో విసృతమైన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు సమాజ సభ్యులను భాగస్వాములను చేస్తూ, అర్హులైన కుటుంబాలను గుర్తించి విద్యార్థులను చేర్పించేలా ప్రోత్సహించారు.అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆక్యుపెన్సీని గరిష్ఠ స్థాయికి పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సమాజం యొక్క క్రియాశీల మద్దతుతో 7వ రోజు కార్యక్రమం విజయవంతమైందని, దీని ద్వారా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్య అందేలా మార్గం సుగమం అయిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.