దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం చాలా కీలకం
పాపన్నపేట,మార్చి17:దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం చాలా కీలకమని మై భారత్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర క్రీడా, యువజన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మై భారత్ పేరిట పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్రీడా కిట్లు అందజేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం పాపన్నపేట మండలం తరుపున పాపన్నపేటకు చెందిన యువసేనా యూత్ అసోసియేషన్ ఎంపిక కాగా వారికి కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలపై యువతలో ఆసక్తి పెంచేందుకు ఈ ఏడాది మెదక్ జిల్లాకు సంబంధించి 35 క్రీడా కిట్లు మంజూరు అయ్యాయన్నారు.
సామాజిక సేవలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసే సంఘాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారని, మై భారత్ - ద్వారా క్రీడా కిట్లు పొందాలంటే 18-29 ఏళ్ల లోపు ఉన్న యువత అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, కార్యదర్శి రంజిత్ రెడ్డి, బీజేయం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, బీజేయం మెదక్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ సుంకరీ సతీష్ కుమార్, యూత్ సభ్యులు దుర్గాప్రసాద్, సతీష్, నితిన్, అజయ్ పాల్గొన్నారు.




