గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు
నిజాంసాగర్ ఏప్రిల్ 22( విజయ క్రాంతి ) జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. ఆయన బుధవారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ,
నాయకులు కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు పడే అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చిన హామీల మేరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత తమరిపై ఉందని ఆయన కార్యకర్తలకు సూచించారు.
ప్రతి కార్యకర్తకు తగిన విధంగా పార్టీలో న్యాయం జరుగుతుందని ఎవరు కూడా అదే పడకుండా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, నాయకులు ప్రజాపండరి, గుర్రపు శ్రీనివాస్, బంగ్లా ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.






