26 May, 2026 | 3:06 AM

మంత్రి తుమ్మలను సన్మానించిన నీలాద్రి దేవాలయ కమిటీ

26-05-2026 01:06 AM

పెనుబల్లి మే 25, (విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం పెనుబల్లి మండలంలో ప్రసిద్ధి గాంచిన నీలాద్రి ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావునీ కలిసి సన్మానించారు.

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీలాద్రి దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు  నీ కోరగా . నీలాద్రి దేవాలయం అభివృద్ధికి కోసం టిటిడి మూడు కోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తూ జీవో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి తుమ్మలని కలిసి నిధులు కేటాయింప గాను వారు తమ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఆ నీలాద్రి స్వామి దేవాలయం అభివృద్ధి కొరకు గతంలో రోడ్లు కరెంటు ఆలయ అభివృద్ధి కోసం గతంలో చేసిన అభివృద్ధి పనులను మంత్రి తుమ్మలకు కమిటీ సభ్యులు గుర్తు చేశారు భవిష్యత్తులో నీలాద్రి దేవస్థానం అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి తుమ్మల కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు