26 May, 2026 | 3:58 AM

ఎడ్యుకేషన్ హబ్‌గా చొప్పదండి నియోజకవర్గం

26-05-2026 01:07 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, మే 25 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర లో ప్ర భుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మం జూరు చేసిన సందర్భంగా గంగాధర మండ లం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గంగాధర మండలం తోపాటు చు ట్టుపక్కలాల మండల పేద మధ్యతరగతి వి ద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే స దుద్దేశంతో తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాల్లోనే చొప్పదండి నియోజకవర్గం వర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాల ని కోరినట్లు తెలిపారు.

తమ అభ్యర్థన మే రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గం వర్గానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్టు తెలిపారు. రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా చొప్పదండిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, రామడుగులో అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్, గంగాధర లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పా టు చేయించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్ ,మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మ నోహర్,ఇప్ప శ్రీనివాస్ రెడ్డి,సువిన్ యాద వ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దు బ్బాసి బుచ్చయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యుడు సత్తు కనుకయ్య, సర్పంచులు వేముల భా స్కర్, రామిడి రాజిరెడ్డి, బారాజు ప్రభాకర్ రెడ్డి, రాచమల్ల రవి,బాసవేణి శ్రీనివాస్, దా సరి శంకరయ్య, చందం ఆంజనేయులు, బి ర్లా ఆనందం,కాంగ్రెస్ నాయకులు గోగురి మహిపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్,పడాల రాజన్న, తదితరులు పాల్గొన్నారు.