2 June, 2026 | 3:46 AM

జీవో నంబర్ 7లో ధోబీ పేరును తొలగించాలి

02-06-2026 12:23 AM

పంజగారి ఆంజనేయులు

మేడ్చల్ అర్బన్ జూన్ 1(విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్రంలో చాకలి,రజక కుటుంబాలను దోభి అనే పర్యాయ పదంతో పోల్చడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 7 లో దోబీ పే రును తొలగించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లకు వినతి పత్రం అందజేసినట్లు ఆయ న చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో చాకలి రజ క కులాలకు ఎంతో ప్రాచుర్యం ఉందని చాక లి అంటేనే కులవృత్తులని గుర్తించేవారని ఆంజనేయులు వెల్లడించారు. గ్రామీణ ప్రాం తాలలో చాకలి అనే వ్యక్తి ఇంటింటా తిరిగి బట్టలు సేకరించి పావులు చెరువుల వద్ద శుభ్రం చేసేవారని ఆయన చెప్పారు.మొట్టమొదటగా సబ్బును కనిపెట్టింది కూడా చాకలి రజకులేనని బట్టలు ఉతకడానికి సౌడు పదార్థాన్ని కనిపెట్టింది చాకలి వాలేనని మంజ గారి ఆంజనేయులు స్పష్టం చేశారు.

ఇలాంటి చాకలి రజకులకు ఉన్నటువంటి మంచి పేరును దోబీ అనే పదంతో పోల్చడం సరికాదని దోభి అనే పదాన్ని జీవో నెంబర్ 7 నుండి తొలగించాలని ఆయన మరోమారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘాల జేఎసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బరుగంటి విట్టల్ తదితరులు పాల్గొన్నారు.