2 June, 2026 | 4:33 AM

బాధ్యతలు స్వీకరించిన డీఇఓ రేణుకాదేవి

02-06-2026 12:21 AM

మేడ్చల్, జూన్ 1 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారిగా రేణుకా దేవి బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ నుంచి బదిలీపై మేడ్చల్ మల్కా జిగిరి జిల్లాకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన విజయకుమారి మహబూబ్నగర్ కు బదిలీ అయ్యారు. విజయ కుమారి నుంచి రేణుకా దేవి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి రేణుక దేవికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక్కడ పనిచేసిన విజయ కుమారి కి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభు త్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంతోపాటు, నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.