మున్సిపల్ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలి
29-07-2026 12:21 AM
మొయినాబాద్ జూలై 28(విజయ క్రాంతి): మొయినా బాద్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్య క్ష పదవిని ఈసారి బీ సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి కేటాయించాలని పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పార్టీ అధ్యక్ష పదవిని గతంలో మూడుసార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగించారని ఆరోపించారు. తాను కూడా ము న్సిపల్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని, పా ర్టీ కోసం చేసిన సేవలను పరిగణనలోకి తీ సుకుని తన పేరును పరిశీలించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.






