చేవెళ్ల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా రాజు
29-07-2026 12:22 AM
మొయినాబాద్/చేవెళ్ల,జూలై 28(విజయ క్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జిగా బేగరి రాజును నియమించినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియామకాన్ని ప్రకటించగా, బేగరి రాజు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బేగరి రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన కల్వకుంట్ల కవితతో పాటు పార్టీ జిల్లా నాయకులు కుమ్మరి శివశంకర్, మొయినాబాద్ మున్సిపల్ అధ్యక్షు డు యండి అన్వార్ ఖాన్, మండల అధ్యక్షుడు భిక్షపతి, షేక్ నూర్ తదితర నాయకుల కు ధన్యవాదాలు తెలిపారు.






