29 July, 2026 | 3:03 AM

మెగా వైద్య శిబిరం

29-07-2026 12:19 AM

ఘట్ కేసర్, జూలై 28 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాదులో బిజెపి  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు సహకారంతో మెడిసిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు అర్జున్ పాల్గొని పరిశీలించారు. ఈసందర్భంగా  చలువాది ప్రవీణ్ రావు మాట్లాడు తూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తర చూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో  రాజేష్, శ్రీశైలం, మల్లేష్, నాగరాజు, ప్రసాద్, వైద్యు లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.