లెక్సస్ ఈఎస్ 500ఈ ఆవిష్కరణ
సీఈవో మురళీధర్ విజన్ పర్యవేక్షణలో ప్రారంభం
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): లెక్సస్ హైదరాబాద్ గర్వంగా ప్రకటిస్తోంది.. పూర్తిగా కొత్త లెక్సస్ ఈఎస్ 500ఈ ఎలక్ట్రిక్ వాహనం లాంచ్‌ను, ఇది భారతదేశంలో లెక్సస్ మొదటి ఎలక్ట్రిక్ వాహన ప్రవేశంగా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ లాంచ్ లెక్సస్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, ప్రీమియం కాఫ్ట్స్‌మమన్‌షిప్ పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
లెక్సస్ ఈఎస్ 500 ఈ ఒక పూర్తిగా ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్. ఇది స్మూత్, నిశ్శబ ,ఆధునిక డ్రైవింగ్ అనుభవం తో పాటు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.89,99,000 కాగా, ఒకసారి పూర్తి చార్జ్ తో 580 కిలోమీటర్ల వరకు ప్రయాణ సామ ర్థ్యం కలిగి ఉంది. లెక్సస్ ఇండియా పాలసీ ప్రకారం ఈవీ బ్యాటరీ సహా పూర్తి వారంటీ అందించబడుతుంది.
ముఖ్య విశేషాలలో కొత్త తరం ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్, లెక్సస్ సేఫ్టీ సిస్టమ్ + ఆధునిక సేఫ్టీ ఫీచర్లు, ప్రీమియం హ్యాండ్క్రాఫ్ట్ ఇంటీరియర్స్, అధునాతన ఇన్ఫోటైన్మెంట్ అండ్ కనెక్టెడ్ టెక్నాలజీ, ఎయిరోడైనమిక్ డిజైన్, నగర, హైవే డ్రైవింగ్‌కు అనువైన అధిక సౌకర్యం ఉన్నాయి.
లెక్సస్ తన క్రాఫ్ట్స్‌మమన్‌షిప్, ఎలక్ట్రిఫికేషన్, విశ్వసనీయత మరియు ఓమోటెనాషి హాస్పిటాలిటీ విలువలతో లగ్జరీ మొబిలిటీని కొత్త స్థాయికి తీసుకెళ్తూ కొనసాగుతోంది.ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని లెక్సస్ హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం లెక్సస్ హైదరాబాద్ సీఈవో మురళీధర్ విజన్, పర్యవేక్షణలో జరిగింది.






