08-02-2026 12:22:43 AM
దరఖాస్తులు స్వీకరణ 10 నుంచి
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దరఖాస్తులు స్వీకరణ ఈనెల 10 నుంచి ప్రారంభం అవుతుంది. ఎలాంటి అపరాధ రుసుమూ లేకుండా ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు, ఆలస్య ఫీజుతో మే 13 వరకు గడువిచ్చారు. మే 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడు, మే 18 న పరీక్షను నిర్వహిస్తారు. ప్రిలిమినరీ కీ ని మే 23న, ఫలితాలను జూన్ 5న ప్రకటించనున్నారు.