08-02-2026 01:08:33 AM
కొలంబో , ఫిబ్రవరి 7 : టీ20 ప్రపంచకప్‌లో తొలిరోజే సంచలనం తృటిలో తప్పిపో యింది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ చుక్కలు చూపించారు. తమ బౌలింగ్, ఫీల్డింగ్‌తో వారికి చెమటలు పట్టించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఈజీ టార్గెట్‌తో బరిలో కి దిగిన పాక్ జట్టుకు ఓపెనర్ సైమ్ అయూ బ్ మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. పవర్ ప్లేలోనే పాక్ 61 పరుగులు చేసింది.
తర్వాత నెదర్లాండ్స్ బౌలర్లు వరుస వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టారు.114 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్స్ సంచలనం సృష్టించేలా కనిపించింది. ఈ దశలో ఫాహీమ్ అష్రాఫ్(11 బంతుల్లో 29) మెరుపులు మెరిపించి పాక్‌ను గెలిపించాడు. 19 వ ఓవర్లో 4 సిక్సర్లు బాది పాక్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఫలితంగా పాక్ మరో 3 బంతులు మిగిలుండగా గెలిచింది.