లంబాడీల గర్జన సదస్సును విజయవంతం చేయాలి
కోదాడ ఆగస్టు 2 :లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30న కోదాడ పట్టణంలో నిర్వహించనున్న లంబాడీ హక్కుల పోరాట సమితిని విజయవంతం చేయాలని ఆ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ కెఆర్‌ఆర్ డిగ్రీ కాలేజ్ లో సన్నాహక సమావేశంలో జాతీయ, రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ లంబాడీల హక్కుల సాధనకై చెవ్వెళ్ళ డిక్లరేషన్ లో ప్రభుత్వం, గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
లంబాడీల గోర్ బోలీ భాషను భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనులు దున్నుకుంటున్న పోడు భూములను వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలన్నారు.
లంబాడీలకు తక్షణం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు గిరిజనులకు కేటాయించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్యా కోట్యా నాయక్ , జాతీయ అధికార ప్రతినిధి బాణోతు వెంకట్రాం నాయక్ , రాష్ట్ర కార్యదర్శి బాణోతు నందలాల్ నాయక్ , సూర్యాపేట జిల్లా అధ్యక్షులు భూక్యా రవి నాయక్, రాష్ట్ర నాయకులు బర్మావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.






