3 August, 2026 | 1:40 AM

బీవీఆర్‌ఐటీలో ఘనంగా 26వ స్నాతకోత్సవం

03-08-2026 12:34 AM

బీవీఆర్‌ఐటీలో 1,510 మందికి పట్టాలు

నర్సాపూర్, ఆగస్టు 2: నర్సాపూర్లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో ఆదివారం 26వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూజీ, పీజీ కోర్సులకు చెందిన 1,510 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు, విశిష్ట అవార్డులు అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మి మాట్లాడుతూ, జీవితాంతం నేర్చుకునే తత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే ఉన్నత విజయాలు సాధించవచ్చని పట్టభద్రులకు సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ, సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే నైపుణ్యం, విభిన్న రంగాల పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని తెలిపారు. ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే విద్యార్థులు ప్లేస్మెంట్లు, పరిశోధనలు, ఆవిష్కరణల్లో విశేష విజయాలు సాధించారని అన్నారు.