3 August, 2026 | 2:56 AM

కేరళంలో వర్ష బీభత్సం

03-08-2026 01:42 AM

విరిగిన కొండచరియలు.. ముంచెత్తిన వరదలు

ఎనిమిది మంది మృతి.. మరో ఎనిమిది మంది గల్లంతు

తిరువనంతపురం, ఆగస్టు 2: రాష్ట్రవ్యాప్తంగా శనివారం కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడడం.. వరదలు ముంచెత్తడంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. 13 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఆదివారం తెలిపారు.

27 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 196 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 209 సహాయక శిబిరాలకు 5,792 మందిని తరలించామని సతీశన్ పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, అలాగే తమ ఇళ్లు, జీవనోపాధిని కోల్పోయిన వారికి ప్ర భుత్వం తప్పక సహాయం అందిస్తుందని ఆ యన హామీ ఇచ్చారు. శనివారం తర్వాత వర్షం తీవ్రత తగ్గినప్పటికీ, ప్రజలు- ముఖ్యం గా కొండ ప్రాంతాల్లో నివసించేవారు- అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ప్రజా ప్రతిని ధులు, సహాయక బృందాలు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కేరళంలోని 12 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ఆగస్టు 3, 6 తేదీలలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కేరళ-ం, కర్ణాటక, -లక్షద్వీప్ తీర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది. ఉత్తర కేరళం తీరం వెంబడి 2.7 నుంచి 3.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడొచ్చని ‘ఇండియన్‌నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ హెచ్చరించింది.