డీఐఈవో వీ.ఆంజనేయరావు పదవీ విరమణ
03-08-2026 01:41 AM
కరీంనగర్, ఆగస్టు 2 (విజయ క్రాంతి): జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి ఆంజనేయరావు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరై ఆంజనేయరావు దంపతులను సన్మానించారు. ఆంజనేయ రావు, అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్గా, డీఐఈవో గా అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు వీర్ల వెంకటేశ్వర్ రావు, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.






