1 June, 2026 | 4:16 AM

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి

01-06-2026 02:23 AM
  1. పవర్ ప్లే 4 ఓవర్లకు తగ్గించాలి
  2. ఐపీఎల్‌లో మార్పులు చేయాలన్న సచిన్

ముంబై, మే 31 : ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉంచాలా లేదా అనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కొందరు దీనిని వ్యతిరేకిస్తే, మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసేయాలని సూచించా డు. టీ20ల్లో బ్యాట్‌కూ, బంతికీ సమప్రాధాన్యత ఉండాలని అభిప్రాయపడ్డాడు. తాజా గా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ ఐపీఎల్‌లో కొన్ని మార్పులు చేయాలంటూ తన అభిప్రాయాలు పంచుకున్నా డు.

“నేను వ్యక్తిగతంగా గమనించిన పలు విషయాలను మీతో పంచుకుంటున్నా. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి. ఈ 20 ఓవర్ల ఆటలో ఇప్పటికే ఉన్న బ్యాటిం గ్ లైనప్‌కు అదనంగా మరొకరిని తీసుకుంటున్నారు. అది బౌలర్లకు పెనుసవాల్‌గా మారింది. ఇప్పుడు మరొక బ్యాటర్ అంటే బౌలర్లకు మరింత కష్టమైపోయింది. నాకు అక్కడ సమతుల్యత లేదనిపించింది” అని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లే విషయంలోనూ సచిన్ కీలక సూచనలు చేశాడు.

తొలి ఆరు ఓవర్లను పవర్ ప్లేగా నిర్వహిస్తున్నారని, దీని ని నాలుగు ఓవర్లకు తగ్గించాలన్నాడు. మిగిలిన రెండు పవర్ ప్లే ఓవర్లను బౌలింగ్ టీమ్ కెప్టెన్ నిర్ణయం మేరకు వదిలేయాలని సచిన్ వ్యాఖ్యానించాడు. దానిని ఎప్పుడు వాడుకోవాలనేది అతడి ఇష్టమన్న సచిన్ ఫీల్డింగ్ నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉం డక్కర్లేన్నడు. ఇలా చేయడం వల్ల మ్యాచ్ ఇరు జట్లకూ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు.

దీని తో పాటు మరో కీలక మార్పు కూడా చేయాలని సచిన్ చెప్పుకొచ్చాడు. టీ20ల్లో ఒక బౌలర్‌కు ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలని సూచించాడు. “జట్టులోని ఏదొక బౌల ర్‌కు మాత్రమే ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలి. అత్యుత్తమ బౌలరే ఆ ఓవర్‌ను వే స్తాడు. మరి బెస్ట్ బౌలర్ బౌలింగ్‌ను ఎవరికైనా చూడాలని అనిపిస్తుంది కదా.. టాప్ బ్యాటర్లు 20 ఓవర్లూ ఆడుతున్నప్పుడు బెస్ట్ బౌలర్‌కు ఐదో ఓవర్ ఎందుకు ఇవ్వకూడదు?” అని సచిన్ ప్రశ్నించాడు.