1 June, 2026 | 2:45 AM

వేతనంలో కోత!

01-06-2026 01:56 AM

ఉద్యోగుల జీతంలో 1.5 శాతం కట్

  1. హెల్త్ స్కీం అమలుకు కట్ చేసిన ప్రభుత్వం
  2. భగ్గుమన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
  3. విధివిధానాలు రూపొందించకుండా ఎలా చేస్తారని ఆగ్రహం
  4. తిరిగి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల వేత నంలో కోత పడింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌సీ) కోసం   మూలవేతనం నుంచి 1.5శాతం నిధు లు ప్రభుత్వం కట్ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నాయి. పథకం విధివిధానాలు ఖరారు కాలేదని, హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదరలేదు, ప్యాకేజీ రేట్లు నిర్ణయించక ముందే వేతనం ఎలా కట్ చేస్తారని ప్రశ్నిస్తున్నాయి.

వేతనం లో 1.5 శాతం మినహాయింపు (కటింగ్)పై జీవో కూడా ఇవ్వలేదని, ఆర్థికశాఖ అత్యుత్సాహం ప్రదర్శించి మే నెల వేతనంలో కోత విధించటం తగదని ఆయా సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కట్ చేసిన వేతనా న్ని తిరిగి వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇద్దరికీ కట్ చేశారు: టీఆర్టీఎఫ్

మే నెల వేతనంలో 1.5 శాతం కటింగ్‌తో పేస్లిప్పులొస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా, ఒక రికే కట్ అవుతుందన్న నిబంధనకు విరుద్ధంగా ఇద్దరి వేతనాల నుంచి కట్ చేస్తున్నారు. ఇది ట్రయల్ రన్ మాత్రమేనా, వాస్తవంగానే కట్ చేస్తున్నారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రభుత్వ తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

ప్రభుత్వ నిర్ణయం నిబంధనలకు విరుద్ధం?: టీపీటీఎఫ్ 

ఈహెచ్‌ఎస్ కోసమని మే నెల వేతనం నుంచి 1.5 శాతం కట్ చేయడాన్ని టీపీటీఎఫ్ తీవ్రంగా ఖం డిస్తుంది. రాష్ట్రంలోని ఏ హాస్పిటళ్లలో ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నారనే స్పష్టత లేదు. వేతన మిన హాయింపులు ఏ విధంగా చేస్తారనే నిబంధనలు రూపొందించకుండానే ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి కట్ చేయటం నిబంధనలకు విరుద్ధమని టీపీటీఎఫ్ నేతలు అంటున్నారు.

ఈహెచ్‌ఎస్ మాకొద్దు : సీపీఎస్ 

ఈహెచ్‌ఎస్ మాకొద్దు. మా సంగతి తేల్చందే వేతనాల నుంచి కోతలా?. ఈ రోజు ఆర్థిక శాఖ తీసుకు న్న ఏకపక్ష నిర్ణయంపై  సీపీఎస్ సంఘం తీవ్ర అసహనం, నిరసన వ్యక్తం చేస్తోంది. ముందస్తు చర్చలు, ఉద్యోగుల సమ్మతి లేకుండా వేతనాల నుండి 1.5 శాతం కోత విధిస్తూ పే-స్లిప్స్ జనరేట్ చేయడం రా జ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి యూనియన్లతో చర్చలు జరపాలి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాల్సి వస్తుందని సీపీఎస్ సంఘం నాయ కులు హెచ్చరిస్తున్నారు.

జోక్యం చేసుకోవాలి :  టీఎస్‌యూటీఎఫ్

ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈహెచ్‌ఎస్ చందా పేరిట ఉద్యోగుల వేతనాల్లో 1.5 శాతం కోత విధించటాన్ని టీఎస్‌యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్యశాఖ ఇస్తుందని సమాధానం చెప్పిన ఆర్థిక శాఖ అధికారులు..    అవేమీ లేకుండానే వేతనాల్లో కోత ఎలా పెడతారు. ఉద్యోగులు ఇంకా వివరాలు పూర్తిగా నమోదు చేసుకోలేదు. నిజానికి ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంర క్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం ఖరీదైన సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం కోరిన ప్పుడు సంఘాలు అంగీకరించాయి. ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను తొలగించి ఆరోగ్య పథకాన్ని పా రదర్శకంగా అమలు చేయాలి. ముఖ్యమంత్రి వెంట నే జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలు నిలివేయాలి. 

నమోదు 50 శాతమే పూర్తయింది: ఎస్టీయూటీఎస్

ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల నమోదు ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా పూర్తికాలేదు. అప్పుడే వేతనం ఎలా కట్ చేస్తారుంటూ ఎస్టీయూ టీఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఆరోగ్య పథకం అమలుకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మార్గదర్శకాలను విడుదల చేయాలి. విధివిధానాలు ప్రకటించిన తర్వాత మాత్ర మే దీన్ని అమలు చేయాలి. 

కోత విధించడం అన్యాయం: తపస్

హెల్త్‌కార్డులకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించకుండా, ఉపాధ్యాయ సం ఘా లతో చర్చించకుండానే వేతనాల నుంచి ప్రీమి యం వసూలు చేయడం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హెల్త్ స్కీం ఇష్టంలేని వారికి దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధానకార్యదర్శులు వొద్నాల రాజశేఖర్, టీ.పెంటయ్య పేర్కొ న్నారు. డిపెండెంట్లకు వ యోపరిమితిని 25 నుంచి 35 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కోత విధించిన ప్రీ మియం మొత్తాన్ని తిరిగి చెల్లించి, కార్డులు జారీ చేసిన తర్వాత కోతలు చేపట్టాలని తెలిపారు.