స్వియాటెక్‌కు షాక్
ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమి
పారిస్, మే 31 : ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. నాలుగుసార్లు చాంపియన్, మాజీ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ప్రిక్వార్స్‌లోనే ఇంటిదారి పట్టింది. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 15వ ర్యాంకర్ మార్తా కొస్త్యుక్ చేతిలో 7--5, 6--1తో స్వియాటెక్ ఓటమి పాలైంది. గంటా 39 నిమిషాల పాటు సాగి న పోరులో కొస్త్యుక్ 5 ఏస్‌లు సంధించగా.. స్వియాటెక్ ఒక్కటి కూడా కొట్టలేదు. కొస్త్యుక్ 25 విన్నర్లు సంధించగా, స్వియాటెక్ కేవలం 13 విన్నర్లకే పరిమితమైంది.
గతంలో తలపడిన మూడుసార్లు ఓటమి పాలైన కొస్త్యుక్ ఈసారి మాత్రం స్వియాటిక్‌పై పైచేయి సా ధించింది. ఇప్పటివరకు క్లే కోర్టులో కొస్త్యుక్ వరుసగా 16వ విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ప్రెంచ్ ఓపెన్‌కు ముందు క్లే కోర్టులో టైటిల్ నెగ్గిన కొస్త్యుక్ ఆ తర్వాత మాడ్రిడ్ టోర్నీ కూడా గెలుచుకుంది.
మరోవైపు 2024 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత స్వియా టెక్ క్లే కోర్టులో మరో టైటిల్ గెలవలేదు. జూన్ 2న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో కొస్త్యు క్ ఏడో ర్యాంకర్ ఎలీనా స్వితోలినాను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్ లో స్విటోలినా, సారా క్రిస్టే కూడా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. అటు పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్. రఫెల్ జొ డార్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.






