ఛాంపియన్స్ ఆర్‌సీబీ
అద్వితీయం
వరుసగా రెండోసారి ట్రోఫీ బెంగళూరు కైవసం
ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై ఘన విజయం
ఛేజింగ్‌లో విరాట్ విశ్వరూపం
* ఐపీఎల్‌లో 17 ఏళ్ల నిరీక్షణకు గత ఏడాది తెరదించిన ఆర్‌సీబీ జైత్రయాత్ర ఈ సీజన్‌లోనూ కొనసాగింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే ఆడుతూ ఫైనల్‌కు దూసుకొచ్చిన బెంగళూరు తుదిపోరులోనూ దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో గుజరాత్‌ను చిత్తు చేసింది. గుజరాత్ పెద్దగా పోటీఇవ్వని వేళ ఫైనల్ ఏకపక్షంగా ముగిసింది. బౌలింగ్‌లో సమిష్టిగా రాణించగా, బ్యాటింగ్‌లో కింగ్ కోహ్లీ తన మార్క్ చూపించాడు. ఫలితంగా బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డులకెక్కింది.
* ఒకప్పుడు ఐపీఎల్ టైటిల్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గత ఏడాది తమ ట్రోఫీ కలను నెరవేర్చుకుంది. అయితే తమ గెలుపు దాహం తీరలేదని నిరూపిస్తూ మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించి టైటాన్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే ఛేజింగ్‌లో కింగ్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఫలితంగా బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్‌తో తమ ఫ్యాన్స్‌కు పుల్ కిక్ ఇచ్చింది.
- ఫైనల్లో గుజరాత్ చిత్తు
- ఛేజింగ్‌లో కింగ్ కోహ్లీ షో
- ఆర్‌సీబీకి వరుసగా రెండో టైటిల్
- తుది పోరులో తుస్సుమన్న గుజరాత్
- సమిష్టిగా రాణించిన బెంగళూరు బౌలర్లు
అహ్మదాబాద్, మే 31 : ఫైనల్లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ పటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీస్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఫామ్ లో ఉన్న ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. పేస ర్లు సమిష్టిగా రాణించి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశారు. సీజన్ ఆద్యంతం సూపర్ ఫామ్ లో ఉన్న గిల్, సాయి సుదర్శన్ అసలైన పోరులో చేతులెత్తేశారు. ఈ సీజన్‌లో గుజరాత్ విజయాలకు ప్రధాన కారణం టాపార్డర్ బ్యాటర్లే.
దీంతో ఆర్బీబీ బౌలర్లు వారిపైనే ఫోకస్ పెట్టారు. పవర్ ప్లే ముగిసే లోపే గిల్ (10), సాయి సుదర్శన్ (12)ను ఔట్ చేశారు. నిశాంత్ సంధు(20) పర్వాలేదనిపించగా.. ఆదుకుంటాడనుకున్న బట్లర్ (19) కూడా నిరాశపరిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్లో వెనకబడి పో యింది. లీగ్ స్టేజ్‌లో భారీస్కోర్లు చేసిన ఆ జట్టు బంతికో పరుగు తీసేందుకు శ్రమించింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ గుజ రాత్‌ను ఆదుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అర్షద్ ఖాన్ తో 26 పరుగులు, తెవాటియాతో 16 , జాసన్ హోల్డర్ తో 27 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా గుజరాత్ స్కోరు 150 దాటగలిగింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తెవాటియా (7), రషీద్ ఖాన్ (7), హోల్డర్ (7) పరుగులకు వెనుదిరిగారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
భువనేశ్వర్ కుమార్ 2, హ్యాజిల్ వుడ్ 2 , కృనాల్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. ఛేజింగ్‌లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడింది. విరాట్ కోహ్లీ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టేశాడు. ఛేజింగ్‌లో కింగ్ అని తనను ఎందు కు పిలుస్తారో చూపించాడు. వెంకటేశ్ అ య్యర్, కోహ్లీ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీకి మెరుపు ఆరంభ మే దక్కింది. తొలి వికె ట్‌కు ఓపెనర్లు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించారు.
వెంకటేశ్ 16 బంతు ల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత పడిక్కల్ (1), పటిదార్ (15), కృనాల్ పాం డ్యా (1) వెంటవెంటనే ఔటవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపించింది. అయితే విరాట్ కోహ్లీ గుజరాత్ బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగి ఆడాడు. టిమ్ డేవిడ్‌తో కలిసి ఐదో వికెట్ కు 41 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడిన టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 24 రన్స్ కు వెనుదిరిగాడు.
తర్వాత కోహ్లీ, జితేశ్ శర్మ బెంగళూరు విజయాన్ని పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 (9 ఫోర్లు, 3 సిక్సర్లు) నాటౌట్, జితేశ్ శర్మ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో వరుసగా రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లోనూ బెంగళూరు అదరగొట్టింది. పలు కష్టమైన క్యాచ్ లను ఆర్సీబీ ఫీల్డర్లు అద్భుతంగా అందుకున్నారు. కాగా గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసాడు. ఈ విజయంతో వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన మూడో జట్టు గా బెంగళూరు ఘనత సాధించింది.
వైభవ్ సరికొత్త చరిత్ర
ఐపీఎల్ 19వ సీజన్ ఆద్యంతం పరుగుల వరద పారించిన చిచ్చర పిడుగు వై భవ్ సూర్యవంశీకి అవార్డుల పంట పం డింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకు న్నాడు. ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వా ల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయ ర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రుకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ పురస్కారాలకు ఎంపికయ్యాడు. మొ త్తం రూ.40 లక్షలతో పాటు టాటా సియారా కారును అందుకున్నాడు. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసిన వైభవ్ 15 ఏళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ అవార్డుల జాబితా
ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్
ప్లేయర్, సూపర్ స్ట్రుకర్, సూపర్ సిక్సెస్,
ఆరెంజ్ క్యాప్ : వైభవ్ సూర్యవంశీ
పర్పుల్ క్యాప్ : కగిసో రబాడ
క్యాచ్ ఆఫ్ ది సీజన్ : మనీశ్ పాండే
మోస్ట్ డాట్స్ : మహ్మద్ సిరాజ్
మోస్ట్ ఫోర్స్ : సాయి సుదర్శన్
ఫెయిర్ ప్లే అవార్డ్ : పంజాబ్ కింగ్స్
విజేత ఆర్‌సీబీ : రూ.20 కోట్లు
రన్నరప్ గుజరాత్ : రూ. 12.5 కోట్లు
స్కోరు బోర్డు
గుజరాత్ ఇన్నింగ్స్ : 155/8
(వాషింగ్టన్ సుందర్ 50 నాటౌట్, నిశాంత్ సింధు 20, బట్లర్ 19, రసిక్ సలాం దార్ 3/27, భువనేశ్వర్ 2/29, హ్యాజిల్‌వుడ్ 2/37)
బెంగళూరు ఇన్నింగ్స్ : 1161/5 (కోహ్లీ 75 నాటౌట్, వెంకటేశ్ అయ్యర్ 32, టిమ్ డేవిడ్ 24, రషీద్ ఖాన్ 2/25, అర్షద్ ఖాన్ 1/32)






