యుద్ధం ఎఫెక్ట్.. చమురు 180 డాలర్లు!?
- గ్యాస్ ధరలపైనా భారీప్రభావం
- ఏప్రిల్ తర్వాత కూడా నౌకలను హోర్ముజ్ అడ్డుకుంటే పరిస్థితులు మరింత తారుమారు
- సౌదీ అరేబియా అంచనా
దోహ, మార్చి 20: పశ్చిమాసియా ఘర్షణల్లో ఇంధన క్షేత్రాలు టార్గెట్ అవుతున్నా యి. ఇరాన్ సౌదీ అరేబియా, ఖతార్, కువైట్‌లోని ప్రధాన ఇంధన కేంద్రాలపై దాడి చేసింది. హోర్ముజ్ జలసంధిలో అంతరాయాలతో ఇప్పటికే నెలకొన్న చమురు భయాలకు ఈ దాడులు ఆజ్యం పోస్తున్నాయి. దీంతో మంటలు చెలరేగి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 60% పైగా పెరిగింది.
జలసంధిలో నౌకల రాకపోకలను ఏప్రిల్ తర్వాత కూడా ఇలానే అడ్డుకుంటే. చమురు ధర ఒక బ్యారెల్ 180 డాలర్ల వరకు పెరగొచ్చని సౌదీ అరేబియా అంచనా వేస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్--అమెరికా మధ్య యుద్ధం మొదలైన, నేటికి 21 రోజులకు చేరింది. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉంది. తాజా గా ఒక దశలో అది 119 డాలర్లకు చేరుకుంది.
ఈ పరిణామాలపై సౌదీ విదేశీ వ్యవహారాల నిపుణుడు ఉమర్ కరీం మాట్లాడు తూ.. ‘ఎర్ర సముద్రంలోని టెర్మినళ్లపై దాడి జరిగితే.. రవాణాకు అడ్డంకి ఏర్పడితే.. ముడిచమురు ధర 150 డాలర్లకు పెరగడం అసా ధ్యమేమీ కాకపోవచ్చు అని పేర్కొన్నారు. హోర్ముజ్ ఎఫెక్ట్‌తో గల్ఫ్ దేశాలు కొత్త మా ర్గాలపై దృష్టిపెడుతోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సౌదీ అరేబియా ఎర్ర సము ద్రం మీదుగా చమురు ఎగుమతులను పెం చింది.
అక్కడి యాన్బు పోర్టు సమీపంలోని అరామ్కి రిఫైనరీపై డ్రోన్ దాడి చేసిన సంగ తి తెలిసిందే. ఇప్పటికే హోర్మూజ్ అంతరాయాలు కొనసాగుతుండగా.. ఎర్రసముద్రం టెర్మినళ్ల పైనా దాడులు కొనసాగితే సంక్షో భం మరింత ముదరొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖతర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రం రస్ లఫాన్‌పై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
దీని మరమ్మతులకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉందని పారిస్‌లోని గ్లోబల్ ఎనర్జీ పా లసీ కేంద్ర పరిశోధకురాలు అన్నె సోఫీ అంచనా వేశారు. ‘నష్ట ప్రభావం ఏ స్థాయి లో ఉందో ఇంకా మనకు తెలియదు. కానీ ఇతర ఎల్‌ఎన్ కేంద్రాల్లో గతంలో జరిగిన ఘటనలను బట్టి చూస్తే.. దానిని సాధారణస్థితికి తీసుకురావడానికి నెలల సమయం పట్టొచ్చు. దీంతో గ్యాస్ ధరలపై ప్రభావం భారీగా ఉండొచ్చు అని పేర్కొన్నారు.




