ఇంధన రిఫైనరీల రిపేర్‌కు ఐదేళ్లు
- ఇరాన్ దాడులతో 17 శాతం ఎన్‌ఎల్‌జీ ప్లాంట్లు దెబ్బ
- మరమ్మతులకు 26 బిలియన్ డాలర్లు అవసరం
- ఖతర్ ఎనర్జీ సీఈవో సాద్ అల్-కాబీ
దోహ, మార్చి 20: దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిలాంటి ఇంధన ఉత్పత్తి క్షేత్రాలపై ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతర్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయని ఖతర్ ఎనర్జీ సీఈవో సాద్ అల్-కాబీ వెల్లడించారు. వాటిని రిపేర్ చేయడానికే మూడు నుంచి ఐదేళ్లు పడుతుందని తెలిపారు.
ఖతర్ ఈ తరహా దాడులు జరుగుతాయని తాను కల లో కూడా ఊహించలేదని, ముఖ్యంగా రంజాన్ మాసంలో తమ సోదర దేశం ఈ వి ధంగా చేస్తుందని అనుకోలేదని ఖతర్‌ఎనర్జీ సీఈవో పేర్కొన్నారు. ఎల్‌ఎన్ సరఫరాలకు సంబంధించి ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరి యా, చైనాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉంద న్నారు. అంతేకాకుండా దెబ్బతిన్న కేంద్రాల పునర్నిర్మా ణానికి 26 బిలియన్ డాలర్లు (రూ.2.43 లక్షల కోట్లపైనే) ఖర్చు అవుతుందన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ ఎన్‌జీ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటైన రాస్ లాఫా న్ ప్లాంట్ పై క్షిపణి దాడి జరగడంతో కతార్ ఎల్‌ఎస్బీ ఎగుమతి సామ ర్థ్యంలో సుమారు 17 శాతం దెబ్బతింది. దీనికి 11 ఏటా 1.83 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ దాడుల్లో 14 ఎల్‌ఎసీ ట్రైన్లలో కనీసం రెండు, అలాగే ఒక గ్యాస్టులిక్విడ్స్ యూనిట్ దెబ్బతిన్నాయి. ఫలితంగా సంవత్స రానికి 12.8 మిలియన్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి 3 నుంచి 5 ఏళ్ల వరకు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ దాడుల ప్రభావంతో కండెన్సేట్ ఎగుమతులు 24 శాతం, ఎల్పీజీ 13 శాతం, హీలియం 14 శాతం వరకు తగ్గనున్నట్లు అంచనా. ఇది భారత్‌లోని రెస్టారెంట్ల నుంచి దక్షిణ కొరియా చిప్‌పరిశ్రమల వరకు ప్రభావం చూపనుంది. దెబ్బతిన్న యూనిట్ల పునరుద్ధరణ కు భారీ సమయం పడుతుందని, మౌలిక సదుపాయాలు 10-20 సంవ త్సరాల వెనక్కి వెళ్లిపోయాయని అధికారులు చెబుతున్నారు.
హోర్ముజ్ జలసంధి లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్ర భావం పడుతోంది. ఈ నేపథ్యంలో హోర్ము జ్ విషయంతోపాటు ఇంధన మార్కెట్లను స్థిరీకరించ డానికి అవసరమైన సాయం చే సేందుకు సిద్ధంగా ఉన్నామని యూకే, ఫ్రా న్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశా లు పేర్కొన్నాయి. ఇరాన్‌దాడులను ఈ దేశాలు ఖండించాయి. దాడులను తక్షణమే ఆపాలని పిలుపునిస్తూ.. ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.




