15 May, 2026 | 3:27 AM

మద్దతు ధర పెంపును పునరాలోచించాలి

15-05-2026 02:12 AM

సూర్యాపేట, మే 14 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం రైతుకు ప్రయోజనం లేదనని దానిపై పునరాలోచించుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు అన్నారు. స్థానిక చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగిన  సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేవన్నారు ముఖ్యంగా వరికి 72 రూపాయలు ప్రకటించడం సరికాదన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై పెద్ద ఎత్తున పెంచుతూ పంటలకు తక్కువ ధరలు ప్రకటించడం అంటే వ్యవసాయ రంగాన్ని మరింత దివాలా తీయించడమేనన్నారు.

వరికి 2,441 అంటే 3.93% పత్తి 6.2% మొక్కజొన్న. 06% పెరుగగ అదే ఎరువులకు  18.50%, వ్యవసాయ పనిముట్లకు  25% రేట్లు పెంచడం దారుణం అన్నారు. పెట్టుబడులకు పెద్ద ఎత్తున  పెంచడం, మద్దతు ధరలు అతి తక్కువ పెంచడం సరైన విధానం కాదన్నారు. జిల్లాలో 12 లక్షల టన్నుల వరి పండుతున్నదని కొనుగోలు సగానికే పరిమితం చేస్తున్నారన్నారు. జిల్లాలో రైతులు గతంలోనే  ఎకరాకు సగటున 15000 నష్టపోతున్నారు.

ఇప్పుడు పెరిగిన ధర కూడా ఉపయోగం లేక మరో రెండు వేలు నష్టపోయే పరిస్థితి ఉన్నదన్నారు. రైతుకు ప్రభుత్వం 46% రుణ సౌకర్యం కల్పిస్తే 54% ప్రైవేటు అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు. ఫలితంగా గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడిదాకా అప్పుల పాలై వ్యవసాయాన్ని వదులుకుంటున్నారన్నారు.  ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం తప్ప మరొకటి కాదన్నారు.

అలాగే పంటల కొనుగోలు తీరులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోనెసంచుల్లో నింపిన బస్తాలను కూడా లారీలు లేవనే వంకతో ఎగుమతి కాకపోవడంతో రైతు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు అష్ట కష్టాలు పడి పంటలు పండిస్తే సకాలానికి కొనుగోలు చేయని మూలంగా రైతు మరింత నష్టపోతున్నారు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, అలుగుబెల్లి వెంకటరెడ్డి, కోట మధుసూదన్ రెడ్డి, మేకల కనకారావు, పి నాగన్న పాల్గొన్నారు.