ఉపాధి హామీ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
15-05-2026 02:17 AM
రాజాపూర్ మే 14:అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులను కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం మండలంలోని మల్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో తగిన వసతులు కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గడువు లోపల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధి కారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు.






