15 May, 2026 | 3:25 AM

చదువుతోనే అభివృద్ధి సాధ్యం

15-05-2026 02:20 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

జడ్చర్ల, మే 14: ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటేనే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ& ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే గ్రామీణ విద్యాభివృద్ధికి పునాది అని అన్నారు.

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా ఆధునిక సదుపాయాలతో భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సత్యమొల పాండు, ఉప సర్పంచ్ దోర్వి నాగలక్ష్మి మల్లేష్, వార్డు సభ్యులు ఉమాదేవి, దోర్వి రమేష్, పెద్దమోని శివకుమార్ చిట్యాల సురేష్ ,ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.