15 May, 2026 | 1:40 AM

తాలు, తరుగు పేరిట ఇబ్బంది పెట్టవద్దు చివరి గింజా కొంటాం

15-05-2026 12:54 AM
  1. ధాన్యానికి మద్దతు ధర ఇస్తాం 
  2. మాది రైతు పక్షపాతి ప్రభుత్వం 
  3. ఇప్పటికే 30 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం 
  4. రూ.4,600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం 
  5. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  6. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన

నల్లగొండ/ఖమ్మం/కూసుమంచి, మే -14 (విజయక్రాంతి): తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, యాసంగిలో రైతులు పం డించిన ధాన్యం చివరి గింజ వరకు మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా చెట్ల చెన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పరిశీలించారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో 140 లక్షల టన్నుల వరి పండిందని, అందులో 80 లక్షలు టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. 18.67 కోట్ల గన్ని బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపినట్లు వెల్లడించారు.

ధాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు వీటి ద్వారా 30 లక్షల టన్నుల ధాన్యం కొని, రూ.4,600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రానున్న 2, 3 రోజుల్లో మరో 9 లక్షల టన్నుల ధాన్యా న్ని మిల్లులకు పంపిస్తామని పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. 3.84 లక్షల మంది రైతుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు  వెల్లడించారు.

గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో అత్యధికంగా వరి పండించిన, కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. . పతి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం రూ.22 వేల కోట్లు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. తరుగు, తాలు విషయంలో మిల్లర్లు, ట్రేడర్‌లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. రాష్ట్రవ్యాప్తంగా 1800 మిల్లులు ఎంఎస్పి ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని, 12 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన ఇంటర్మీడియట్ గోదాం సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. 

హమాలీల కొరత ఉన్నది..

రవాణా సమస్య పరిష్కారం కోసం ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చే 15 రోజుల పాటు లారీలు, డీసీఎంలను ఇతర అవసరాలకు కాకుండా ధాన్యం రవాణాకే వినియోగించాల ని నిర్ణయించామని చెప్పారు. ధాన్యం రవాణా లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రులు జిల్లాల వారీగా పర్యటిస్తూ కొనుగోళ్ల ప్రక్రియ ను సమీక్షిస్తున్నారని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌పోర్ట్, హమాలీల సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో గతంలో కంటే ఈ రబీలో అధి క దిగుబడి వచ్చినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా పండినట్లు తెలిపారు.

చెట్ల చెన్నారం లో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్‌పీ శరత్చంద్ర పవార్, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, పాలేరు గ్రామంలో కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ శ్రీరామ్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, ఇన్‌చార్జి డీఎం సివిల్ సప్లై సునీల్‌రెడ్డి, డీసీవో గంగాధర్, సెంటర్ ఇన్‌చార్జి రేణుక పాల్గొన్నారు.