15 May, 2026 | 3:26 AM

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

15-05-2026 02:10 AM

నల్లగొండ క్రైం, మే 14: అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపైచర్లపల్లిలో వెల్ కమ్ నల్లగొండ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం నిడుమనూర్ మండలం రాజన్నగూడెంకు చెందిన బోల్లం లింగయ్య (40) కూలీ పనుల్లో భాగంగా గుగ్గినపల్లి హనుమంతరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై మిర్యాలగూడ వైపు వస్తుండగా ఎంఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ కు వెళ్లే మార్గంలో వెనుక నుండి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన కంటైనర్ డీకోట్టినట్లు తెలిపారు.

ద్విచక్రవాహనం నడుపుతున్న హనుమంతరెడ్డి ఎగిరి ఎడుమవైపు పడగా లింగయ్య కుడివైపు పడి కంటైనర్ వెనుక టైర్ కింద పడి నడుముపై వెళ్లడంతో కాళ్లు నుజ్జునుజ్జుఅయి అక్కడిక్కడే మృతిచెందినట్లు తెలిపారు. హనుమంతరెడ్డికి మాత్రం గాయాలు కావడంతో అసుపత్రి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో మృతుని భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.