ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాల
8వ వార్డు కౌన్సిలర్ కోలా ఉదయభాను
హుజూర్ నగర్, మే 14: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని గోవిందాపురం 8వ వార్డు కౌన్సిలర్ కోల ఉదయభాను ఉపేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని గోవిందాపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించాలని పిలుపునిచ్చారు. గోవిందపురం ప్రభుత్వ పాఠశాలకు 20 లక్షల రూపాయలు మంత్రి ఉత్తమ్ నిధులు మంజూరు చేశారని తెలిపారు.
త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎమ్ గొట్టే శ్రీనివాసరావు,ఉపాధ్యాయుల వీరస్వామి, చంద్రశేఖర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగలక్ష్మి పాల్గొన్నారు.






