29 August, 2026 | 3:21 AM

విద్య, వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం

29-08-2026 12:05 AM

అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తోట 

జుక్కల్, ఆగస్టు 28 (విజయక్రాంతి):  జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో  జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదల  పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.

వైద్యశాఖ అధికారులు పీహెచ్సీల్లో సరిపడా మందుల లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, గర్భిణీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. పేదలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే నా కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందులో నియోజకవర్గంలోని ఎంఈఓ లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు.