29 August, 2026 | 2:13 AM

బీఆర్‌ఎస్ నాయకులు చేసినవి తప్పుడు ఆరోపణలు

29-08-2026 12:03 AM
  1. వరదలు వస్తే పరమార్శించని బీఆర్‌ఎస్ నాయకులు
  2. ఏడాదికి వచ్చి మాట్లాడడం ఏమిటి: కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్

కామారెడ్డి, ఆగస్ట్ 28 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ నాయకులు గురువారం కామారెడ్డి లో చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరేణి  సందీప్ కుమార్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. గత ఏడాది వరదల లో నష్టపోయిన బాధితులను కనీసం పరామర్శించిన పాపాన పోలేదని ఏడాదికి వచ్చి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రజలకు మేలు చేసింది ఎవరు అనేది ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, షబ్బీర్ అలీ పై తప్పుడు ఆరోపణలు చేయడం బిఆర్‌ఎస్ నాయకులు మానుకోవాలన్నారు. కామారెడ్డిలో మీ నాయకుడు కేసీఆర్ పోటీ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కామారెడ్డి ప్రజలు ఓడించిన విషయాన్ని మరిచి మాట్లాడడం బి ఆర్ ఎస్ నేతలకు తగదు అన్నారు. దమ్ముంటే మీ పార్టీ పండు నుంచి 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు.

కామారెడ్డి పట్టణంలో వరదలు వచ్చి సంవత్సరం గడిచిన ఎలాంటి సహాయక చర్యలు చేపట్ట లేదని నిన్నటి రోజున బిఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు అన్నారు.ఈ కార్యక్రమంలో గూడెం శ్రీనివాస్ రెడ్డి, పండ్లరాజు ,రాజా గౌడ్ ,గోనెశ్రీనివాస్, ఇప్ప శ్రీనివాస్ గుడుగుల శ్రీనివాస్, కౌన్సిలర్లు ,అంజద్ , జావిద్ ,కాళ్ళ గణేష్,గంగాధర్, యునుస్, సిద్ధిక్, అన్వర్ అహ్మద్, లడ్డు, రాజు,కళ్లెం సత్యం, కోయల్కర్ కన్నయ్య, కిరణ్ ,హనుమాన్ల రవి, లక్క పతిని గంగాధర్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.