9 May, 2026 | 2:21 AM

రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

09-05-2026 01:05 AM
  1. 8 వేల రైతు కుటుంబాలకు భీమా
  2. బ్యాంక్ అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి, మే 8 (విజయ క్రాంతి) సహకార రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వినూత్న పథకాలను ప్రవేశపెడుతోంది. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలోని 8 వేల రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా రైతులకు జనతా పర్సనల్ ప్రమాద బీమా పాలసీ అమలు చేస్తున్నట్లు బ్యాంకు అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి వివరించారు

గత ఆరు నెలల క్రితం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం వాగులో పడి కొట్టుకుపోగా ఆయన భార్య అప్పని అనితకు బీమా పథకం కింద వచ్చిన రెండు లక్షల రూపాయలు అందజేశారు. సంఘంలోని రైతులంతా సహకార బ్యాంకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తప్పకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జనరల్ మేనేజర్ మారుపాటి రామ్ రెడ్డి, బ్యాంకు ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య తో పాటు రైతులు పాల్గొన్నారు.