25 July, 2026 | 2:26 AM

స్వయం ఉపాధితోనే భవిష్యత్తు

25-07-2026 01:39 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, జూలై 24 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఉన్నత స్థాయికి ఎదగాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జైపాల్ రెడ్డిలు కందుకూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తోందని, యువత స్వయంగా ఉపాధి పొందుతూ మరికొందరికి మార్గదర్శకంగా నిలవాలని కోరారు. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు సైతం ఆర్థికంగా తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకుడు దేవేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అండేకార్ యాదిలాల్, మాజీ సర్పంచ్ బొజ్జ వెంకట్రాం రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.