భవిష్యత్తులో సమస్యలు లేకుండా రీ సర్వే
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
అడ్డాకుల, జూలై 24: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుం డా రాచాల, పొన్నకల్ గ్రామాల మధ్య హద్దులు కేటాయించేందుకు రిసర్వ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. అడ్డాకల్ మండలం లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పర్యటించి పొన్నకల్ గ్రామంలో జరుగుతున్న నాన్ కెడస్టల్ భూముల రీ-సర్వే పనులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ ఫైళ్ళను తనిఖీ చేశారు.
పొన్నకల్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించి, గ్రామ సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొన్నకల్‌రాచాల గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ (బౌండరీ లైన్) రీ-సర్వే ప్రక్రియను కలెక్టర్ మ్యాప్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు.
రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, గ్రామస్థుల సహకారంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ,అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, సర్వే ల్యాండ్ రికారడ్స్ ఏ.డి. అశోక్, అడ్డాకల్ తహసీల్దార్ కె. శంకర్, మండల స్థాయిలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






