ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత తప్పనిసరి
మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్
భూత్పూర్, జూలై 24: ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె. పవన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు గోప్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద శుక్రవారం ఇంకుడు గుంతల నిర్మాణంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె. పవన్ కుమార్ మాట్లాడుతూ వర్షపు నీటిని వృథా కాకుండా భూగర్భ జలాల్లోకి ఇంకేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్ తరాలకు తాగునీటి వనరులను పరిరక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లాలు నాయక్, పద్మా నరేందర్, వార్డు అధికారి కె. శివకుమార్ చవాన్, వార్డు ఆర్పీ ఎం. విజయలక్ష్మి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.






