25 July, 2026 | 3:09 AM

ఐటీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేటీఆర్‌దే

25-07-2026 02:24 AM

బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ

వేములవాడ, జులై 24 (విజయక్రాంతి): ఐటీ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘ నత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే దక్కుతుందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల పోలింగ్ బూత్ ఏజెం ట్లు, సభ్యులకు ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబి తాపై బూత్ స్థాయి ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉండాలని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవెల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చెక్కపల్లి గ్రామంలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేముల వాడ రాజన్న, భీమన్న స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యక ర్తలు, బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు.