25 July, 2026 | 2:26 AM

చేవెళ్ళలో అదనపు కలెక్టర్ కిరణ్మయి పర్యటన

25-07-2026 01:37 AM

మున్సిపల్ కేంద్రంలో ఓటర్ సవరణ, అంగన్వాడీ కేంద్రాల తనిఖీ

చేవెళ్ళ జులై 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి చేవెళ్ళలో సందర్శించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక వోటరు సవరణ ప్రక్రియ (సర్) వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల నుంచి గణన పత్రాలు స్వీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని బిఎల్‌ఓలను ఆదేశించారు.

డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తాత్సరం జరగడానికి వేలేదన్నారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గూర్చి ఆరా తీశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేశారు. వండపడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సపరేట్ మెల్, ఫిమేల్ వార్డు నిర్వహించేందుకు ప్రాబ్లం ఉందని చెప్పారు. వైద్యం కొరకు ఆసుపత్రికి పచ్చిన రోఫుల చూసి సంతృప్తి చెందినట్లు డాక్టర్. లక్ష్మికాంత్ రెడ్డి చెప్పారు.