21 July, 2026 | 8:00 AM

సీతారాంపల్లిలో ముసలయ్య-, ముసలవ్వ పండుగ

20-07-2026 12:17 AM

సిద్దిపేట రూరల్, జూలై 19: సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో ఆదివారం ముసలయ్య  ముసలవ్వ పండుగ నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ పండుగ నిర్వహించాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు, రైతులు పాల్గొని సంప్రదాయబద్ధంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, పశు పోషణ సుభిక్షంగా ఉండాలని గ్రామదేవతలను వేడుకున్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థనలు చేశారు. గ్రామ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇలాంటి వేడుకలను ప్రతి ఏడాది నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.