14 May, 2026 | 2:48 AM

వాలీబాల్ కిట్ల పంపిణీ

14-05-2026 01:42 AM

ములకలపల్లి, మే 13 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో మూకమామిడి గ్రామపంచాయతీ లో మొగరాలగుప్ప యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి తన సొంత నిధులతో బుధవారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.

గ్రామంలోని ఆరుజట్ల యువకుల కోసం మూడు వాలీబాల్ నెట్లు,మూడు వాలీబాల్స్,36 జెర్సీలను సర్పంచ్  స్వయంగా కొనుగోలు చేసి యువకులకు అందజేశారు. అనంతరం గ్రామ యువకులను క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకని గ్రామ యువత డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని క్రీడల్లో రాణించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ రహిత మత్తు పదార్థాల రహిత గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క యువకుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.