29 May, 2026 | 4:48 AM

రైతన్న నిలువు దోపిడీ!

29-05-2026 02:16 AM
  1. లారీలు రావాలన్నా.. ధాన్యం దిగాలన్నా...
  2. జేబులు ఖాళీ కావాల్సిందే...
  3. చోద్యం చూస్తున్న అధికారులు, నాయకులు

జన్నారం, మే 28 : రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునేడా తప్పా చేస్తుందేమి లేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల్లో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దోచుకునుడే తప్ప రైతులకు చేస్తున్న మేలు ఏమి లేదని బాహాటంగానే వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అమ్ముకునేందుకు వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే నెలలు గడుస్తున్నా కొనే నాథుడు లేడని,

ఒక వేళ తూకం వేసిన వడ్లను మిల్లులకు తరలించే నాథుడే లేడంటే అతిశయోక్తి కాదు. నాయకులు ఏదో సాధిస్తున్నామన్నట్లు తడిసిన వడ్లు తీసుకుంటాం అని ప్రకటనలు చేస్తున్నారే తప్ప అసలు ధాన్యం ఎందుకు పోవడం లేదు..? తూకం వేసి పంపిస్తే ధాన్యం ఎందుకు తడుస్తదని రైతులు ప్రశ్నిస్తున్నారు. పది మంది నాయకులను వెంటేసుకొని వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామనుడు తప్పా చేసింది, చేస్తున్నది ఏమీ లేదని రైతులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.

అటు లారీలు, ఇటు గన్నీల కొరత...

రైతు పంట పండించడం ఒక ఎత్తుతై, దానిని అమ్ముకోవడం గగనమైపోయిందిప్పుడు! అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు వెళితే గన్నీలుండవు, ఒక వేల గన్నీలు రైతుకు దొరికినా తూకం వేయాలంటే రైతుకు అవస్థలు తప్పడం లేదు. క్వింటాలు ధాన్యానికి హమాలీ రూ. 50 కాగా, కూల్ క్యాన్ కు రూ. 50, కుప్పకు ఒక కూల్ డ్రింక్ పేరిట రూ. 100, హమాలీ మామూలు పేరిట కుప్ప వడ్లకు రెండు డబ్బాల వడ్లు తీసుకుంటుండగా, తూకం వేసిన బస్తాలు తీసుకెళ్లేందుకు లారీ కేంద్రానికి రావాలంటే ఒక్కో బస్తాకు రూ. 10 నుంచి రూ. 16 వసూలు చేస్తున్నారు.

ఇదీ పోను మిల్లులో అన్ లోడ్ కావాలంటే మిల్లు హమాలీలకు బస్తాకు రూ. 3 వసూలు చేస్తున్నారు. తూకం వేసేందుకు హమాలీ క్వింటాలుకు రూ. 50 తప్పా మిగితావన్నీ ప్రభుత్వం నిర్ణయించిందా? కలెక్టర్ నిర్ణయించాడా? సంబంధిత శాఖ అధికారులు సెటిల్ చేశారా లేక కేంద్రం నిర్వాహకుడు ప్రత్యేక టోల్ వసూలు చేస్తున్నాడా..? అని రైతులు తమ ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. 

కల్లానికి తీసుకొచ్చి న్లుతైంది.. 

నాకున్న మూడెకరాల్లో వరి సాగు చేసిన. నెల రోజుల కింద ట పండించిన పం టను కల్లానికి (కొనుగోలు కేంద్రానికి) తీసుకొచ్చిన. మొ త్తుకోంగ మొత్తుకోంగ వారం రోజుల కిందట కాంటా చేసిండ్రు. ఇగ లారీ వచ్చేది లేదు.., బస్తాలు పోయేది లేదు... బస్తాకు 43 కిలోల చొప్పున జోకిండ్రు. వారం రోజులుగా ఎండలోనే ఉంటున్నాయి.. మర్ర షార్టేజీ పేరిట ఇంకెంత కోత విధిస్తారో... లీడర్లు, సార్లు వచ్చు డు.. చూసుడు.. పోవుడు తప్ప చేస్తుంది ఏమీ లేదు. ఆ(వా)నలు కొట్టద్దని దేవు న్ని, జోకిని బస్తాలు తీసుకుపొమ్మని గా సెంటరోల్లని మొక్కని రోజు లేదు సారూ...

రాజారావు, జన్నారం