13 July, 2026 | 1:44 AM

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్ ఆవిర్భావం

13-07-2026 12:40 AM

కోదాడ, జూలై 12: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ రక్షణ సమితి చారిత్రాత్మకంగా ఆవిర్భవించిందని ఆపార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ భూక్యా సంజీవనాయక్ అన్నారు. ఆదివారం కోదాడలో తెలంగాణ రక్షణ సమితి జెండా పండుగ సందర్భంగా జెండా ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సమితి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. గతంలో బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ కోసం విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగం చేసిన న్యాయం జరగలేదన్నారు. రైతుల, కార్మిక, విద్యార్థుల, నిరుద్యోగుల, మహిళల సమస్యలపై కవితక్క రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న తెలంగాణ రక్షణ సమితిని ప్రజలు ఆదరించాలన్నారు.

కవితక్కను ముఖ్యమంత్రి చేసి ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సమితి జెండా పండుగలు ఘనంగా జరుగుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల గొండ నియోజకవర్గ ఇన్చార్జి మరియు పార్టీ విక్రాంత్ రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ యారా లవాస రెడ్డి, కోదాడ నాయకులు ఏనుగుల ఏలేశ్వరం, స్వాతి, మమత, చడ పొంగు గొట్టిముక్కుల శ్రీనివాసరావు తోట శ్రీనివాసరావు మరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.