13 July, 2026 | 1:45 AM

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

13-07-2026 12:40 AM
  1. నమోదు పత్రాలను అధికారులకు ఇవ్వాలి 
  2. తప్పులు లేకుండా వివరాలు యాప్‌లో నమోదు చేయాలి 
  3. రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డి

ఎల్బీనగర్, జులై 12(విజయక్రాంతి) : ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ఓటర్లు పూర్తిస్థాయీలో సహకరించి, అధికారులు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసి, తిరిగి బీల్వోలకు అందజేసి, ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కోరారు.

ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని శ్రీసా యిరామ్ కాలనీ, సాహెబ్‌నగర్‌లో సర్ కార్యక్రమాన్ని సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్‌లైన్ డిజిటైజేషన్‌పైబూత్ లెవెల్ అధికారులకు పలు సూచనలు చేశారు. సర్ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.