స్విట్జర్లాండ్‌పై ఘనవిజయం
కన్సాస్ సిటీ, జూలై 12: సాకర్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై 3 స్కోరుతో విజయం సా ధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచే అర్జెంటీనా దూకుడు ప్రదర్శించింది. ఆట మొద లైన 10వ నిమిషంలో మాక్ అలిస్టర్ గోల్ కొట్టి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని అందించాడు. తొలి అర్ధభాగం వరకు అర్జెంటీనా ఆధిపత్యంలో ఉన్నా మరో గోల్ మాత్రం సాధించ లేకపోయింది.
67వ నిమిషంలో స్విస్ ప్లేయర్ డాన్ ఎండోయె చేసిన గోల్‌తో స్కో రు 1- సమమైంది. నిర్ణీత సమయంలో విజ యం సాధించలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అదనపు సమయంలో అర్జెంటీనాకు స్విట్జర్లాండ్ గట్టి పోటీనిచ్చింది. మ్యాచ్ షూటౌట్‌కు వెళ్తుందేమోనని అనుకున్నారు. కానీ 112వ నిమిషం లో జూలియన్ అల్వారెజ్ గోల్ చేసి ఆధిక్యా న్ని పెంచాడు. ఆ తర్వాత సమం చేయాలని స్వి ట్జర్లాండ్ ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. చివరి నిమిషాల్లో లౌటారో మార్టినె జ్ రీబౌండ్‌ను గోల్‌గా మలిచి స్కో రును 3 పెంచాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.






